మీసాలు లాగిన వానిని ఏం చేయాలి? - అక్బర్ బీర్భర్ కథలు Akbar Birbal stories 9

మీసాలు లాగిన వానిని ఏం చేయాలి? 

అక్బర్ బీర్బల్ కథలు, అక్బర్ బీర్బల్ కథలు తెలుగు, అక్బర్ బీర్బల్ స్టోరీ, Akbar Birbal kathalu telugu pdf, Akbar birbal stories telugu in english, Akbar birbal stories telugu pdf, Akbar birbal stories telugu pdf download, Akbar birbal stories telugu pdf free download, Akbar birbal stories telugu wikipedia, Akbar Stories in Telugu, Akbar Birbal Stories in zee Telugu, Akbar Birbal Stories in Telugu with pictures, Akbar birbal stories telugu download


ఆనాడు అక్బరు పాదుషావారు సభకు కాస్త ఆలస్యంగా వచ్చారు. సమయ పాలన పాటించే అక్బరువారి ఆలస్యానికి సభాసదులు తత్తరపడ్డారు. అది గమనించిన అక్బరు వారికి వారి తత్తరపాటు ఔచిత్యాన్ని గురించి 'ప్రశ్నించాలన్న ఆసక్తి కలిగింది. తమరాకకు గల ఆలస్యాన్ని సభాసదులకు వివరించారు.


నేను దర్బారుకు బయలుదేరి వస్తున్న సమయంలో' ఒకడు వచ్చి నా దుస్తులను చిందరవందర చేసాడు. గడ్డం పట్టుకుని పీకేడు. మీసాలను లాగి నన్ను బిత్తరపర్చాడు. వాడ్ని యేంచెయ్యాలో తోచక తేరుకుని సభవారినే నిర్ణయించమని అడగవచ్చని రావడంతో ఈ ఆలస్యం జరిగింది. నేనిప్పుడు వానిని యేంచెయ్యాలి. సభవారే నిర్ణయించాలన్నాడు అక్బరు.


“ప్రభూ! వానిని కఠినంగా శిక్షించాలి - చెరసాలలో పెట్టాలి. దేశంనుండి బహిష్మరించాలి. కొరడాలతో కొట్టించాలి”. అని ఎవరికి తోచిన శిక్షను వారు సూచించారు.


బీర్బల్‌ లేచి “ప్రభూ! వానిని మీరు ఏ విధంగానూ శిక్షించడం సబబు కాదు. మీపైకి వచ్చి మీదుస్తులు నలిపి, మీసాలు మెలిపెట్టి, గెడ్డం మెలిపెట్టి వ్యవహరించగల హక్కుగాని, అవకాశంగాని ఇతరులెవ్వరికి ఉండదు. తమ మనుమలకు మాత్రమే ఆ అవకాళం కలుగుతుంది, మీమీది 'మమతానురాగంతో, మీరు వారిపట్ల చూపించు గారమువల్లను మీతో ఈ తరహా చనువును ప్రదర్శించడం వారికే చెల్లుతుంది.


ఇలా తమతో ఆటలాడుకుని మిమ్ములను మురిపించు మీ మనువడికి మీరు మిఠాయిలు పంచి పెట్టాలి. ముద్దులు కురిపించాలి. కానుకలివ్వాలి” అని వివరించాడు బీర్బల్‌.


అతని ఆలోచనా సరళికి సహేతుకమైన వివరణకు, అవగాహనకు అక్బరుపాదుషావారు మిక్కిలి ఆనందించి వానిని కానుకలతో సత్కరించారు.
Posted by VARMA

Post a Comment

0 Comments