సంకట నాశన గణేశ స్తోత్రం విత్ మీనింగ్
నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే (1)
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం (2)
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్ (3)
నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ (4)
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో (5)
విద్యార్ధి లభతే విద్యాం ధనార్ధి లభతే ధనామ్
పుత్రార్ధీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్ (6)
జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః (7)
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః (8)
ఇతి సంకట నాశన గణేశ స్తోత్రం సంపూర్ణం.
మీనింగ్
ఆయుస్సు పెరగాలని, ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యం గౌరీపుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లవలెను (1)
మొదట వంకర తిరిగిన తొండము కలవానిగా, రెండు ఒకే దంతము కలవానిగా, మూడు నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా, నాలుగు ఏనుగు ముఖము కలవానిగా గణేశుడిని భావింపుము. (2)
ఐదు పెద్ద ఉదరము కలవానిగాను, ఆరు శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించువానిగాను, ఏడు విఘ్నములు తొలగించువానిగాను, ఎనిమిది పొగవంటి తెల్లని శరీర కాంతి కలవానిగా విఘ్నేశ్వరుడిని భావింపుము (3)
తొమ్మిది బాలచంద్రరేఖ నుదుటిన కలవానిగా, పది విశిష్టమైన నాయకునిగా పదకొండు ప్రమథగణములకు ఆధిపతిగా పన్నెండు ఏనుగు ముఖము కలవానిగా వినాయకుడిని భావింపుము. (4)
ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాతఃకాలము, మధ్యాహ్నము, సాయం సంధ్యలలో పఠింతురో వారికి విఘ్నభయముండదు. వారు కోరినది సిద్ధించును. (5)
విద్యను కోరుకునేవారికి విద్య, ధనం కోరుకునే వారికి ధనము, పుత్రులు కావాలనుకునేవారికి పుత్రులు, మోక్షం కావాలనుకునే వారికి మోక్షం లభిస్తాయి. (6)
ఈ గణపతి స్తోత్రం ఆరు నెలలు పఠిస్తే కోరిన ఫలితం లభిస్తుంది. సంవత్సరం జపిస్తే సిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులలో తప్పక విజయం లభిస్తుంది ఇందులో ఎటువంటి సంశయం అవసరం లేదు. (7)
ఈ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో లిఖించి ఎనిమిది మంది బ్రాహ్మణులకు దానం చేసిన ఎడల విద్యతో పాటు సర్వమూ గణేశుడు ప్రసాదిస్తాడు. (8)
0 Comments