రెండు గాడిదల బరువు - అక్బర్ బీర్బల్ కథలు Akbar Birbal stories6

రెండు గాడిదల బరువు 

రెండు గాడిదల బరువు - అక్బర్ బీర్బల్ కథలు Akbar Birbal stories6


ఒకప్పుడు అక్బరు. బీర్బల్‌ కలసి సాయం సంధ్యలో విహరిస్తున్నారు - వారివెంట అక్బరు కుమారుడు కూడా ఉన్నాడు. వెళ్ళగా వెళ్ళగా వారికొక సుందర సరోవరం కనిపించింది. చుట్టుమెట్లు కలిగి ఆ ప్రాంతం ఎంతోమనోహరంగా ఉన్నది.


అక్బరు కుమారునకు ఆ సరోవరంలో స్నానం చెయ్యాలన్న కోరిక కలిగింది. అతడు తన తండ్రికి తన అభిలాషను వివరించాడు. పాదుషాకు కూడా స్నానం చెయ్యాలి అనిపించింది. వెంటనే తండ్రికొడుకులిద్దరు స్నానానికి సరోవరంలో దిగారు. వారి దుస్తులు బీర్బల్‌ని పట్టుకోమని ఇచ్చేరు.


ఒడ్డున తమదుస్తులు పట్టుకుని నిల్చున్న. బీర్బల్‌ను చూచి అక్బరుకు వేళాకోళం ఆడాలనిపించింది. “బీర్బల్‌' నీపై గాడిద బరువున్నది కదా!” అన్నాడు. ఆ మాటలలోని పరిహాసాన్ని పసిగట్టిన బీర్బల్‌ వాటిని తిరగవేసి చెప్పి అక్బరునే పరిహసించాలని అనిపించి ఆ విషయం పైకి తేలకుండా “జహాపనా! క్షమించండి. ఉన్నది ఒక్క గాడిద బరువు కాదు. ప్రభువులు పొరపడుతున్నారు. రెండు గాడిదల బరువున్నూదని వెటకారం చేశాడు.


ఆ మాటలో అంతరార్థాన్ని గ్రహించి, తానాడిన వెటకారానికి సిగ్గుపడి బీర్బల్‌ తెలివితేటలకు మిక్కిలి ఆనందించి అభినందించాడు.Posted by VARMA

Post a Comment

0 Comments