రైతు బాకీ తీర్మానము - అక్బర్ బీర్భర్ కథలు Akbar Birbal stories5

రైతు బాకీ తీర్మానము 

రైతు బాకీ తీర్మానము - అక్బర్ బీర్భర్ కథలు Akbar Birbal stories5


అక్బరు పాదుషావారి రాజ్యములోని ఒకరైతు వద్ద ఒక భూస్వామి కొంత సొమ్మును అప్పుతీసుకొనెను. ఆ రైతు ఎన్నిసార్లు అడినను ఎంతగా బ్రతిమలాడి అడిగినను ఆ భూస్వామి అప్పును తీర్చలేదు. అక్బరువారితో ఫిర్యాదు చేసుకొందునని రైతు ఆ భూస్వామిని అదలించెను పాదుషావారివరకు వెలితే తగువు ముదురునని జంకి - ఉపాయమును ఆలోచించెను. నీ అప్పు తీర్చివేసెదను. నీతోనాకు గొడవదేనికి పత్రమును తీసుకొని రమ్మని చెప్పెను. రైతు మిక్కిలి సంతోషించి పత్రమును తీసుకుని కామందువద్దకు వెళ్ళెను, ఆ కామందు ఆ పత్రమును పుచ్చుకుని ముక్కలు ముక్కలుగా చింపివేసి నీకునేనేమియు బాకీలేను. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో అని గదమాయించి కాపును తరిమివేసెను.


కాపు పాదుషావారి వద్దకు వెళ్ళి జరిగినదంతయు చెప్పి న్యాయము జరిపించ వలసినదని కోరెను. పత్రము - సాక్షులులేని ఆ అప్పును పరిష్కరించుట సాధ్యము కానందువల్ల అక్బరు ఆ తగవును బీర్బల్‌ను పరిష్కరించమనెను. రేపు సభకు రావలసినది తీర్పిచ్చెడనని బీర్బల్‌ వారిని పంపించివేసెను. అనంతరం బీర్బల్‌కాపు ఇంటికివెళ్ళి అతడే కాగితముపై నీకు పత్రము వ్రాసి యిచ్చెనని ప్రశ్నించెను. తెల్లకాగితముపై అని అతడు చెప్పెను. రేపు దర్బారునందు నిన్నిదే ప్రశ్న అడిగినప్పుడు గులాబి రంగు కాగితముపై వ్రాసి యిచ్చెనని చెప్పవలసినదని కాపునకు సలహా యిచ్చెను.


ఆ మర్నాడు దర్బారులో కాపును కామందును విచారణచేయుచు బీర్బల్‌ కాపునుద్దేశించి ఓయీ! కామందు నీకు పత్రము వ్రాసి యిచ్చినాడనుచున్నావు. ఏ కాగితముపై వ్రాసియిచ్చెనో చెప్పగలవా? అని ప్రశ్నించెను. చిత్తము. గులాబి రంగు కాగితముపై వ్రాసి యిచ్చెను అని చెప్పెను. వెంటనే కామందు వానికి అడ్డంపడి నేను తెల్లకాగితముపై వ్రాసి ఇచ్చితినని నోరు జారెను. బీర్బల్‌ అతడ్ని బాకీదారుగా తీర్మానించి, ఆ కామందుచేత వానికాసొమ్ముతో పాటు మరికొంత సొమ్మును ఇప్పించెను



Posted by VARMA

Post a Comment

0 Comments