యమునా నది ఏడుపు - అక్బర్ బీర్బల్ కథలు Akbar Birbal stories7

యమునా నది ఏడుపు

అక్బర్ బీర్బల్ కథలు, అక్బర్ బీర్బల్ కథలు తెలుగు, అక్బర్ బీర్బల్ స్టోరీ, Akbar Birbal kathalu telugu pdf, Akbar birbal stories telugu in english, Akbar birbal stories telugu pdf, Akbar birbal stories telugu pdf download, Akbar birbal stories telugu pdf free download, Akbar birbal stories telugu wikipedia, Akbar Stories in Telugu, Akbar Birbal Stories in zee Telugu, Akbar Birbal Stories in Telugu with pictures, Akbar birbal stories telugu download


ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.యమున నది తీరన్న వున్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది యేడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా యేడుస్తోంది” అనుకున్నాడు. యెంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.


మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో యెవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని  అడిగారు. 


సభికులు తెల్లబోయి, సమధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.బీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేను” అని అన్నాడు.అక్బర్ వెంతనే బీర్బల్ను ఆ రాత్రి అంతహ్పురానికి రమ్మని ఆహ్వానించాడు.


రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమ్నునా నది హోరును విన్నాడు. విషయమర్ధమయ్యింది. “మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో యేడుస్తోంది.” అని మరునాడు సభలో విశ్లేషించాడు. సభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు.


Posted by VARMA

Post a Comment

0 Comments