వంకాయ వంటి కూర - అక్బర్ బీర్బల్ కథలు Akbar Birbal stories4

వంకాయ వంటి కూర 

అక్బర్ బీర్బల్ కథలు, అక్బర్ బీర్బల్ కథలు తెలుగు, అక్బర్ బీర్బల్ స్టోరీ, Akbar Birbal kathalu telugu pdf, Akbar birbal stories telugu in english, Akbar birbal stories telugu pdf, Akbar birbal stories telugu pdf download, Akbar birbal stories telugu pdf free download, Akbar birbal stories telugu wikipedia, Akbar Stories in Telugu, Akbar Birbal Stories in zee Telugu, Akbar Birbal Stories in Telugu with pictures, Akbar birbal stories telugu download


ఒకప్పుడు అక్బర్‌ పాదుషావారి వంటవాడు 'లేత వంకాయలతో' మషాలాపెట్టి గుత్తివంకాయకూర చేశాడు. అది తిన్న పాదుషావారు. దాని రుచికి పరవశించి పోయేయారు. తాను తిన్న వంకాయకూరను గురించి బీర్బల్‌కు వర్ణించి, వర్ణించి, మరీ చెప్పాడు.


వంకాయవంటిది మరేదిలేదయ్యా అని వంకాయను ప్రశంసించాడు పాదుషావారు. నిత్యం ఆ కూరను వంటకాలలో మాకు చేసి వడ్డించమని చెప్పారు. అంతబాగున్న కూరను నేనింతవరకు తినలేదు. రేపు నువ్వుకూడా వచ్చి మాతోపాటు వంకాయ కూరను రుచి చూడవలసినదన్నాడు. ఆ మాటలకు బీర్బల్‌ పాదుషా వారిని ప్రశంసిస్తూ  జహాపనా! వంకాయ కూరగాయలలో సామ్రాట్టు అందువల్లనే “అల్లా” దానినెత్తిన టోపీపెట్టి గౌరవించాడు” అన్నాడు.


అక్బరు వారం పదిరోజుల పాటు వంకాయ కూరతోనే భోజసం చేయడం. వంటవాడు తన పనితనానికి పాదుషావారు సంతృప్తిని పొందుతుండడంతో, మరింత జాగ్రత్తగా, మరింత రుచికరంగా వంకాయకూర రకరకాలుగా పండి పాదుషావారికి వడ్డిస్తుండేవాడు. అలా పది పన్నెండు రోజులు, గడిచేసరికి 'పాదుషావారికి దురదలు సంభవించాయి. వైద్యులను పిలిపించి మందు ఇమ్మని, కారణం యేమై ఉంటుందన్నారు. రోజూ ఆహారంలో వంకాయకూరను  జతపర్చుకుని తినడమే కారణమన్నారు.


అక్బరు, బీర్బల్‌ను పిలిపించి వంకాయ సామ్రాట్టు కనుకనే అల్లాదానికి టోపీ పెట్టి మన్నించేడన్నావు. అది దుష్టమైన కాయగూరని వైద్యులు చెప్పారు ఇప్పుడేమంటావు. అన్నారు. అల్లాపెట్టిన టోపీతో విర్రవీగుతూ శృతిమించి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నందువల్లనే అల్లా దాని నెత్తిన మేకును దిగవేశాడని ముచ్చికను వర్ణించాడు. నిన్న మంచిదన్నావు.


ఇప్పుడు చెడ్డదంటూ నీ మాటను సమర్దించుకుంటున్నావు యేమిటి అని అక్బరు బీర్బల్‌ను ప్రశ్నించాడు. “ప్రభూ! యధారాజా తధాప్రజా! ప్రభూ! అభిమతాన్ని మన్నించడం పౌరధర్మం. మీరు బాగుందన్నప్పుడు నేనూ బాగుందనే అన్నాను. భాగోలేదనడంతో బాగులేదనక తప్పలేదు. మన్నించంది జహాపనా! అన్నాడు. బీర్బల్‌ మాటలకు అక్బర్‌ ఆనందించాడు.Posted by VARMA

Post a Comment

0 Comments