అన్నమయ్య కీర్తన-రామా దశరథరామా నిజసత్య annamayya keerthanalu with meaning

 అన్నమయ్య కీర్తన-రామా దశరథరామా నిజసత్య


అన్నమయ్య కీర్తన-రామా దశరథరామా నిజసత్య, annamayya keerthanalu with meaning,  అన్నమయ్య కీర్తనలు,annamayya keerthanalu,అన్నమయ్య కీర్తనలు విత్ మీనింగ్


రామా దశరథరామా నిజసత్య - 

కామా నమో నమో కాకుత్థ్సరామ                ||పల్లవి||


కరుణానిధి రామ కౌసల్యానందన రామ

పరమపురుష సీతాపతి రామ

శరధిబంధన రామ సవనరక్షక రామ

గురుతరరవివంశ కోదండరామ.                  ||రామా||


దనుజహరణ రామ దశరథసుత రామ

వినుతామరస్తోత్ర విజయరామ

మనుజావతార రామ మహానీయగుణ రామ

అనిలజప్రియ రామ అయోధ్యారామ.          ||రామా||


సులలితయశ రామ సుగ్రీవవరద రామ

కలుషరావణభయంకర రామ

విలసితరఘురామ వేదగోచర రామ

కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ                 ||రామా||


భావం : శ్రీరామా! దశరథ మహారాజ పుత్రుడా! సత్యప్రీతి కలవాడా! కకుత్థ్సవంశ తిలకుడా! నమస్కారము. దయకు గనివంటివాడా! కౌసల్య కుమారుడైన వాడా! పరమపురుష! సీతాభామాపతీ! సేతువు కట్టినవాడా! యజ్ఞ రక్షకుడా! సూర్యకులంలో ప్రభవించిన శ్రీరామా! రాక్షసులను  సంహరించిన రామా! దశరథుని కుమారుడైన శ్రీరామా! వినమ్రులైన దేవతలచే కీర్తించబడినవాడా! మానవావతారాన్ని దాల్చినవాడా! మహనీయగుణాలు కలవాడా! వాయుపుత్రుడైన హనుమంతునికి ప్రియమైన రామా! అయోధ్యాపతీ! సుందరమైన కీర్తిని కలిగినవాడా! సుగ్రీవుని కాపాడిన రామా! కలుషితుడైన రావణాసురునికి భయాన్ని కలిగించినవాడా! ప్రకాశించే శ్రీరామా! వేదవేద్యా! కలిత ప్రతాపా! వేంకటరమణా! నమస్కారము.


Post a Comment

0 Comments